![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -309 లో.....సూర్యతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన మనోహర్ వాళ్ళకి రుద్ర ఫోన్ చేస్తాడు. ఏంటి రుద్ర మా తమ్ముడు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసావని అడగడానికి ఫోన్ చేసావా అని మనోహర్ అంటాడు. లేదు మీరు ఫారెనర్స్ తో కాంట్రాక్టు పెట్టుకుంటున్నారు కదా.. వాళ్ళు ఇప్పుడు మా సూర్య వాళ్ళతో డీలింగ్ పెట్టుకుంటున్నారు. అది స్వయంగా మా వీరు ఏర్పాటు చేసాడు. ఎప్పుడు మా వీరు మా గురించి మాత్రమే ఆలోచిస్తాడని రుద్ర అనగానే వాళ్ళు షాక్ అవుతారు. అదేంటి.. వీరు మనతో వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తానని చెప్పాడు కదా అని వాళ్ళు అనుకుంటారు.
మనతో కలిసి ఇంట్లో వాళ్ళని మోసం చెయ్యాలి అనుకున్నవాడు ఇప్పుడు మనల్ని మోసం చెయ్యలేడా.. ఇప్పుడే వాడి సంగతి చెప్పాలని మనోహర్ వాళ్ళు అనుకుంటారు. మరొకవైపు మొరాకో, పంప్ ఇద్దరికి ఇషిక దగ్గరుండి భోజనం వడ్డిస్తుంది. ఆవకాయ లేదా అని మొరాకో అనగానే అందరు షాక్ అవుతారు. అంటే తెలుగు ఇళ్లలో ఆవకాయ కామన్ కదా అని మొరాకో కవర్ చేస్తాడు. అప్పుడే మొరాకో మీసం ఊడిపోతుంటే రుద్ర సైగ చేసి సరిచేసుకోమని చెప్తాడు. అది వీరు చూసి ఇదంతా రుద్ర ప్లాన్ ఆ అని అనుకుంటాడు. ఛ.. నేను వీళ్ళ ట్రాప్ లో పడ్డానేంటి.. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే నా బంఢారం బయటపడుతుందని వీరు అనుకుంటాడు. అప్పుడే మనోహర్ వాళ్ళు వస్తారు. వీరు.. వీరు అంటూ గట్టిగా అరుస్తాడు మనోహర్. ఇంత మోసం చేస్తావా ఫారెనర్స్ తో డీలింగ్ కుదరుస్తానని చెప్పి, ఇప్పుడు మీ సూర్య వాళ్ళకి డీలింగ్ ఇప్పిస్తున్నావా.. అసలు సూర్య ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసి కుటుంబం పరువు రోడ్డున పడెయ్యాలని చెప్పిందే నువ్వు కదా అని మనోహర్ అనగానే ఇంట్లోని అందరు షాక్ అవుతారు.
నువ్వు ఇంత మోసగాడివి అనుకోలేదని వీరుని మనోహర్ అంటాడు. ఇక అందరు వీరు చేసిన మోసాన్ని తెలుసుకొని వీరుని తిడతారు. తర్వాత మొరాకో, పంప్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇలా చేస్తావ్ అనుకోలేదు బ్రో అని ఇషిక లోపలికి వెళ్తుంది. వీరు దగ్గరికి రుద్ర వచ్చి కుటుంబంలో అందరు నాకు వ్యతిరేకంగా ఉంటారన్నావ్ కానీ ఆ పరిస్థితి నీకు వచ్చిందని రుద్ర అంటాడు. మరొకవైపు జయతో విశ్వ మాట్లాడతాడు. జయ నీకు ఏమైనా గోల్ ఉందా అని విశ్వ అడుగుతాడు. జయ సైలెంట్ గా ఉంటుంది. గంగని చూడు లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించడానికి కష్టపడుతుందని గంగ గురించి గొప్పగా విశ్వ చెప్తాడు. మరొకవైపు మొరాకో, పంప్ గెటప్ లు తీసేసి గంగ, రంగా ఇద్దరు ఏం తెలియనట్టు ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |